Telangana : ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లపై నేడు విచారణ

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లపై నేడు విచారణ జరగనుంది

Update: 2025-11-19 04:35 GMT

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లపై నేడు విచారణ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో వాదనలకు షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిటీషన్ లపై వాదనలను విననున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో...
సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా అనర్హత పిటీషన్లపై విచారణ ముగించి చర్యలను తీసుకోవాలని ఆదేశించడంతో స్పీకర్ కార్యాలయం అనర్హత పిటీషన్లపై విచారణలో వేగం పెంచారు. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరెకపూడి గాంధీ పిటీషన్లపై వాదనలు స్పీకర్ విననున్నారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు స్పీకర్ రేపు విననున్నారు.





Tags:    

Similar News