రేపు హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

రేపు తెలంగాణ భవన్‌లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు

Update: 2026-01-02 12:19 GMT

రేపు తెలంగాణ భవన్‌లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో నీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత పదేళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీశ్ రావు వివరించనున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై...
ప్రధానంగా కృష్ణా, నదీ జలాల వివాదంతో పాటు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు.


Tags:    

Similar News