BRS : నేడు హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
నేడు తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
నేడు తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో నీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత పదేళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీశ్ రావు వివరించనున్నారు.బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేసిన విమర్శలకు కౌంటర్ ఇవ్వనున్నారు.
విమర్శలకు చెక్....
ప్రధానంగా కృష్ణా, నదీ జలాల వివాదంతో పాటు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలను ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తిప్పికొట్టనున్నారు. తమ హయాంలో జరిగిన పనుల గురించి వివరించనున్నారు. అలాగే అధికార కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టేలా హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరగనుంది. బీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని అందరినీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.