కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ రావు
బీజీపీ తో బీఆర్ఎస్ పొత్తుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజీపీ తో బీఆర్ఎస్ పొత్తుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదని హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. బీజీపీతో పొత్తు, విలీనం వార్తలపై ఆయన స్పందించారు. కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్ రావు అన్నారు.
బీజీపీ తో బీఆర్ఎస్ పొత్తుపై ...
దీంతో కల్వకుంట్ల కవిత ఆరోపణలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరగదని, నీటిని ఏపీ తరలించుకు పోతుంటే బీజేపీ ఏం చేస్తుందని హరీశ్ రావు ప్రశ్నించారు. అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అంటూ వస్తున్న వార్తలను హరీశ్ రావు కొట్టిపారేశారు. ఈసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని కూడా హరీశ్ రావు అన్నారు.