Harish Rao : నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు హరీశ్ రావు
లండన్ పర్యటన నుంచి హైదరాబాద్‌కు హరీశ్ రావు చేరుకున్నారు. కేసీఆర్ తో భేటీ కానున్నారు
లండన్ పర్యటన నుంచి హైదరాబాద్‌కు హరీశ్ రావు చేరుకున్నారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న హరీశ్ రావు తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో సమావేశమవుతారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో హరీశ్ రావు ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు.
కవిత విమర్శలపై...
దీంతో పాటు కల్వకుంట్ల కవిత తనపై చేసిన ఆరోపణలు, సస్పెన్షన్ పై కూడా చర్చించే అవకాశముందని తెలిసింది. కవిత హరీశ్ రావుపై విమర్శలు చేసినప్పుడు ఆయన తన కుమార్తెను ఉన్నత చదువుల కోసం లండన్ తీసుకెళ్లారు. అందుకే దానిపై మాట్లాడలేదు. నేడు కేసీఆర్ తో జరిగే భేటీలో వచ్చే క్లారిటీతో హరీశ్ రావు కవిత విమర్శలపై కౌంటర్ ఇచ్చే అవకాశముంది.