Telangana : హరీశ్ రావు ఇంట విషాదం
మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం అలుముకుంది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు తెల్లవారు జామున మరణించారు
మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం అలుముకుంది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు తెల్లవారు జామున మరణించారు. హైదరాబాద్ లోని కోకాపేట్ లోని క్రిస్ విల్లాస్ లో సత్యనారాయణ పార్ధీవ దేహాన్ని ఉంచారు. సత్యనారాయణ వృద్ధాప్యంతోనూ, అనారోగ్యంతోనూ బాధపడుతూ మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు ఇంటికి వచ్చి ఆయనకు సానుభూతిని తెలుపుతున్నారు.
రేవంత్ సంతాపం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు ఇంటికి చేరుకుంటున్నారు.