Harish Rao : బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసింది

కాంగ్రెస్ పాలనలో ప్రజారోగ్యం పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Update: 2025-10-21 07:16 GMT

కాంగ్రెస్ పాలనలో ప్రజారోగ్యం పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్ ప్రభుత్వానికి శ్రద్ధలేదని విమర్శించారు. ఈరోజు హరీశ్ రావు శేరిలింగంపల్లిలోని బస్తీ దవాఖానాను పరిశీలించారు. బస్తీ దవాఖానాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సుస్తీ పట్టిందన్న హరీశ్ రావు రోగులకు మందులు కూడా అందుబాటు లేవని అన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు కూడా లేవని హరీశ్ రావు అన్నారు. నాలుగు నెలల నుంచి తమకు జీతాలు అందడం లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

మాటలకే పరిమితమై...
కేసీఆర్ పై కోపంతోనే కేసీఆర్ కిట్ లను ఈ ప్రభుత్వం తొలగించిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయీలను కూడా ఆసుపత్రులకు చెల్లించకపోవడంతో కార్పొరేట్ వైద్యం దూరమయిందని హరీశ్ రావు అన్నారు. గ్రీన్ చానల్ కూడా మాటలకే పరిమితం అయిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానాల్లో 134 పరీక్షలను ఉచితంగా చేసేవారమని, 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News