Telangana : నేటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-03-15 03:24 GMT

one-day classes

తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

అక్కడ మాత్రం...
అయితే పదో తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు విద్యాసంస్థలు కూడా ఈ సమయం పాటించాలని విద్యాశాఖ ఆదేశించింది.


Tags:    

Similar News