జిమ్.. జొన్న.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

రైతు నేస్తం కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జొన్నరొట్టెలు తినాలని ప్రజలను ప్రోత్సహించారు

Update: 2025-06-17 09:28 GMT

రైతు నేస్తం కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జొన్నరొట్టెలు తినాలని ప్రజలను ప్రోత్సహించారు. రోజూ జొన్న రొట్టె తింటే జిమ్ కు వెళ్ళకుండానే సిక్స్ ప్యాక్ బాడీ వస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఏదో డైట్ అంటూ అడ్డమైన గడ్డి తింటున్నారని, రోజూ జొన్న రొట్టె తింటూ, ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటే జిమ్ములకు వెళ్ళి కండలు పెంచాల్సిన అవసరం ఉండదని సలహా ఇచ్చారు.అ చ్చంపేటలో పండించే దోసకాయ కందిపప్పు కలిపి వండి తింటే బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. ఒకప్పటి రుచులు ఇప్పుడు లేవని, అన్ని పంటలు మారిపోయాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News