Telangana : నేటి నుంచి తెలంగాణలో గ్రామసభలు
తెలంగాణలో నేటి నుంచి గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. లబ్దిదారుల ఎంపిక జరగనుంది
తెలంగాణలో నేటి నుంచి గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. నాలుగు పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
నాలుగు పథకాలకు సంబంధించి...
ఈ నాలుగు పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేసి గ్రామసభల్లో ప్రకటిస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే తెలియచేసే వీలు కల్పించారు. ఈ నెల 24వ తేదీ వరకూ గ్రామసభలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. అర్హతలున్నా ప్రభుత్వం ప్రకటించిన దానిలో తమ పేర్లు లేకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.