Telangana : నేటితో ముగియనున్న గ్రామసభలు

తెలంగాణలో నేటి నుంచి గ్రామసభలు ముగియనున్నాయి

Update: 2025-01-24 03:43 GMT

తెలంగాణలో నేటి నుంచి గ్రామసభలు ముగియనున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయిన గ్రామసభలు నేటితో ముగియనున్నాయి. ఈ గ్రామసభల్లో ప్రజల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులను స్వీకరించారు. అనేక గ్రామసభల్లో ప్రజల నుంచి అధికారులు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. గ్రామసభలను కూడా కొందరు అడ్డుకున్నారు.

నాలుగు సంక్షేమ పథకాలను...
గ్రామసభల్లో నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారుల జాబితాను ప్రకటించడంతో గొడవ మొదలయింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారందరిలో అర్హులను నిర్ణయించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు. ఈరోజుతో గ్రామసభలు ముగియడంతో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఎల్లుండి నుంచి పథకాలను అమలు చేయనున్నారు.


Tags:    

Similar News