గ్రామసభల్లో వస్తున్న దరఖాస్తుల వెల్లువ

తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి

Update: 2025-01-23 12:13 GMT

తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల ప్రజల నుంచి అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ అదే సమయంలో దరఖాస్తులు కూడా అంతేస్థాయిలో వస్తున్నాయి. నాలుగు పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారుల జాబితాను తయారు చేసే సభలు కావడంతో ఎక్కువ మంది గ్రామసభలకు హాజరై తమ వినతులను అధికారులకు సమర్పించుకుంటున్నారు.

నిన్నటి వరకూ...
నిన్నటి వరకు 9,844 గ్రామాలలో విజయవంతంగా గ్రామ సభల నిర్వహించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరిగిన 3888 గ్రామసభలు జరిగాయని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 10 లక్షల 9 వేల 131 దరఖాస్తులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 59,882 దరఖాస్తులు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News