Telangana : తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు

తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు జరుగుతున్నాయి.

Update: 2025-01-23 04:52 GMT

తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. రేపటితో గ్రామసభలు ముగియనుండటంతో అనేక ప్రాంతాల్లో నేడు, రేపు గ్రామసభలను జరిపినాలుగు పథకాలకు సంబంధించిన అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఈ నెల 21 నుంచి గ్రామసభలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

దరఖాస్తుకు సమయం...
ఈ గ్రామ సభల్లోనే అర్హులైన లబ్దిదారుల పేర్లను ప్రకటిస్తున్నారు. అర్హులైన అందరికీ అవకాశం ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకించి సమయం ఏదీ లేదని, రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మూడో రోజు గ్రామసభల్లో ప్రజలు ప్రశ్నించే అవకాశముండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News