ఎమ్మెల్సీగా కోదండరామ్.. గవర్నర్ ఆమోదం

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు

Update: 2024-01-25 11:43 GMT

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు మీర్ అమీర్ ఖాన్ ల పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలియజేయడంతో వారిద్దరూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. నాడు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా వ్యవహరించి అన్ని పార్టీలను కలిపి ఉద్యమంలోకి వచ్చేలా చేశారు.

ఇద్దరి పేర్లను...
తర్వాత ఆయన తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసుకున్నారు. పదేళ్ల నుంచి ఆయన చట్ట సభలకు ఎంపిక కాలేదు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి పోటీకి దూరంగా ఉన్నారు. ఆరోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటా కింద ఆయన పేరును పంపారు. ఆయనతో పాటు సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిట్ జావేద్ ఆలీఖాన్ కుమారుడు మీర్ ఆలీఖాన్ కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.


Tags:    

Similar News