Telangana : గుడ్ న్యూస్...నేటి నుంచి నాలుగు పథకాల అమలు
తెలంగాణలో నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది.
తెలంగాణలో నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నాలుగు హామీలను నేటి నుంచి అమలులోకి తెస్తుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు మంజూరు చేయనుంది. నేడు ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పథకాలను అమలు చేయనున్నారు.
నేటి నుంచి నగదు...
మార్చి నెల వరకూ అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఈ పథకాలను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపక ప్రక్రియ ఈ నెల 21 నుంచి 24వ తేదీ జరిగిన గ్రామసభల్లో నిర్ణయించారు. ఇంకా దరఖాస్తులను క్రోడీకరించి అర్హులైన వారిని ఎంపిక చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. తొలి విడతగా నేటి నుంచి నాలుగు పథకాలను అమలు చేయనునంది. రైతు భరోసా పథకం కింద ఆరు వేలు, ఆత్మీయ భరోసా కింద ఆరు వేల తొలి విడతగా నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.