Telagana : జనవరి 1న ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నీటి పారుదల శాఖ రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రభుత్వం ఇవ్వనుంది
నీటి పారుదల శాఖ రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రభుత్వం ఇవ్వనుంది. జనవరి 1వ తేదీన ప్రజాభవన్ లో కార్యక్రమం జరగనుంది. నీటిపారుదల శాఖ రంగంలో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై సవివరంగా ఈ ప్రెజెంటేషన్ లో తెలియజేయనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, అధికార ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. నీటిపారుదల రంగంపై అవగాహన కల్పించడం కోసం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
నీటి పంపకాలపై...
కృష్ణా, గోదావరి బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నీటి పంపకాలు.. ఎవరి హయాంలో ఎన్ని వాటాలు తరలించుకుపోయారు? ఏఏ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది? ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందింది? అన్న విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా చెప్పనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.