Telangana : తెలంగాణ వాసులకు రేవంత్ గుడ్ న్యూస్... ఒకే రోజు లక్ష రేషన్ కార్డులు

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2025-02-25 04:03 GMT

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి ఒకటోతేదీన ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.

మార్చి ఒకటోతేదీ నుంచి...
ఒకే రోజు లక్ష రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి.


Tags:    

Similar News