Telangana : ఈ నెల 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-04-19 07:55 GMT

ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలువిడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనన్నారు. ఈ ఏడాది మార్చి 5 నుండి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొత్తం పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

కొన్నాళ్లుగా ఫలితాల కోసం...
గత కొన్నాళ్లుగా పరీక్షల ఫలితాల కోసం ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదలయిన తర్వాత ఏ కోర్సులో చేరాలన్నది నిర్ణయించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ నెల 22న తేల్చనుంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News