తెలంగాణలో రెండు రోజులు స్కూల్స్ హాలిడేస్
తెలంగాణాలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తెలంగాణాలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శివరాత్రికి ఈనెల 26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 27వ తేదీన రెండు రోజుల పాటు వరస సెలవులను తెలంగాణ సర్కార్ ప్రకటించింది. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో అందులో భాగంగా కొన్ని జిల్లాలకు సెలవులు ప్రకటించింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో...
ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు మెదక్, నిజామబాద్, ఆదిలాబద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని విద్యాసంస్థలకు 27వ తేదీనసెలవులు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు లేని జిల్లాల్లో మాత్రం యధాతథంగా 27న విద్యా సంస్థలు పనిచేయాలి. అలాగే శివరాత్రికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.