Telangana: నేడు విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Update: 2025-08-29 02:16 GMT

భారీ వర్షాల నేపథ్యంలో నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు కూడా భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ఈరోజు ఆ యా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ జిల్లాల్లో సెలవులు...
కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో భారీ వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. తదుపరి పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీగా నష్టం జరిగిన నేపథ్యలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News