Telangana : రేపు విద్యాసంస్థలకు సెలవు.. అన్ని పరీక్షలు వాయిదా
మెదక్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవును ప్రభుత్వం ప్రకటించింది.
మెదక్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవును ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మెదక్ జిల్లాలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రేపు కూడా భారీ వర్షాలు...
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారాన్ని, మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా నీటి ఉధృతి తగ్గకపోవడంతో బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో పాటు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రేపు, ఎల్లుండి జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.