Raja Singh : కిషన్ రెడ్డిగారూ.. నాకు సమయం ఇవ్వండి
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడటానికి తనకు సమయం ఇవ్వాలని కోరారు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడటానికి తనకు సమయం ఇవ్వాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. తనకు సమయం కొంత సేపు ఇస్తే తన బాధలను చెప్పుకుంటానని రాజాసింగ్ అన్నారు. తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
తన సమస్యలు చెప్పుకునేందుకు...
కొంచెం సమయం ఇస్తే తన సమస్యలను గురించి చెప్పుకునేందుక అవకాశమివ్వాలని కోరారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ అని ఆయన తెలిపారు. ఒక పార్టీ కార్యకర్తను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని రాజాసింగ్ అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని, అందుకు అందరూ ముందుకు రావాలని రాజాసింగ్ పిలుపు నిచ్చారు.