చుట్టుముట్టిన గోదారి

గోదావరి వరదలు తెలంగాణ ప్రాంతాలను దెబ్బతీశాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో వరద ప్రభావం కన్పిస్తుంది

Update: 2022-07-15 03:29 GMT

గోదావరి వరదలు తెలంగాణ ప్రాంతాలను దెబ్బతీశాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ప్రభావం కన్పిస్తుంది. ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు గ్రామాలన్నీ జలదిగ్భంధంలో చిక్కుకుని పోయాయి. ఇప్పటికే అనేక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఉంచారు. ముంపు బాధితులను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. బాధితులను తరలించడానికి హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అనేక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఎస్సారెస్పీలోకి...
శ్రీరాం సాగర్ లోకి కు 1.94 లక్షల క్యూసెక్కుల నీటరు చేరింది. దీంతో 36 గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీరాం సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1087.70 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో మొత్తం 75.46 టీఎంసీ నీరు ఉందని అధికారులు తెలిిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.


Tags:    

Similar News