Breaking : ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట
మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది
మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు పాస్ పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. పాస్ పోర్టు వచ్చిన మూడు రోజుల్లో భారత్ కు రావాలని కూడా ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు ఐదో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ వచ్చేంత వరకూ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడు. ఆయన పై కేసు నమోదయింది. అయితే అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలల నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు చేయడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కొంత వరకూ ప్రభాకర్ రావుకు రిలీఫ్ దక్కేలా పాస్ పోర్టు ఇవ్వాలని ఆదేశించింది.