Revanth Reddy : RBI మాజీ గవర్నర్ తో రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామరాజన్ భేటీ అయ్యారు.
former reserve bank governor
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామరాజన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇరువురు చర్చించుకున్నారని తెలిసింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గత ప్రభుత్వం అప్పులు లక్షల కోట్లు చేయడం, కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీలు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై...
రానున్న కాలంలో ఆర్థిక సమస్యల నుంచి రాష్ట్రం గట్టెక్కడంపై రేవంత్ రెడ్డి రఘురామరాజన్ తో చర్చించినట్లు తెలిసింది. ఆయన సూచనలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. అలాగే ఆయన సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లాలన్న నిర్ణయం కూడా తీసుకోనున్నారు.