కేటీఆర్ కు మైనంపల్లి వార్నింగ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేరన్నారు.కార్యకర్తల జోలికి వస్తే డైరెక్ట్‌గా అటాక్ చేస్తామని మైనంపల్లి వార్నింగ్ ఇచ్చారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని తెలిపారు. సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ కు బుద్ధిచెప్పే రోజులు వస్తాయని మైనంపల్లి హనుమంతరావు అన్నారు.
ఇష్టానుసారం మాట్లాడుతున్నారని...
కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న మైనంపల్లి కేటీఆర్ అరాచకాలపై పుస్తకం రాసి గడపగడపకూ పంచుతానని హెచ్చరించారు. కేటీఆర్ జైలు ఊసలు లెక్కపెట్టడం ఖాయమన్న మైనంపల్లి ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిని పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించడమేంటని ప్రశ్నించారు. ఏపీలో పార్టీని ఎందుకు బీఆర్ఎస్ పెట్టారని మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు.