KTR : నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ కు లేదు

మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ కేసుపై స్పందించారు

Update: 2025-11-21 07:48 GMT

మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ కేసుపై స్పందించారు. ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడని కేటీఆర్ అన్నారు. తనను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినా ఆ కేసు నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసునని కేటీఆర్ అన్నారు.ఆ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసునని చెప్పారు.

గవర్నర్ అనుమతి కోసం...
గవర్నర్ అనుమతి అవసరం లేకున్నా రాజ్ భవన్ కు పంపారన్న కేటీఆర్, గవర్నర్ అనుమతి పేరుతో ఇన్ని రోజులు సాగదీత కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గవర్నర్ అనుమతి కోసం పది వారాలు పట్టిందని, మరింత సాగాదీయాలని చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో దానం నాగేందర్ చేత రాజీనామా చేయిస్తారని, కడియం శ్రీహరి చేత రాజీనామా చేయించరని కటేఈర్ అన్నారు.


Tags:    

Similar News