చంద్రబాబు హైదరాబాద్ ను డెవలెప్ చేశారా.. హ్హ.. హ్హ.. హ్హ
మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు
మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆంధ్రా మహానాడు లో తెలంగాణ ముచ్చటెందుకు అని ఆయన ప్రశ్నించారు. 2004 తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందన్న జగదీశ్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి అయన వల్లనే జరిగిందంటే నవ్వొస్తుందని అన్నారు. 2004 లో సమైక్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26 వేల లోపేనన్నారు జగదీశ్ రెడ్డి. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో మీ ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు.
కేసీఆర్ పాలనలోనే...
కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్న జగదీశ్ రెడ్డి అన్నిరంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయని, ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి ఆదాయముంటే కేసీఆర్ పాలనలో 3.70 లక్షలకు చేరిందన్నారు. ఈరోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ 2.50 లక్షలు మాత్రమేనన్న ఆయన నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగటం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు ప్రేమలేకనే ఎప్పటికైనా హైదరాబాద్ కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా? అని చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలంటూ జగదీశ్ రెడ్డి కోరారు.