Harish Rao : నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు హాజరు కానున్నారు
మాజీ మంత్రి హరీశ్ రావు నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు హాజరు కానున్నారు. నేడు పీసీ ఘోష్ కమిషన్‌ను కలవనున్న హరీశ్ రావు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం పదకొండు గంటలకు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరంపై మరింత సమాచారాన్ని హరీశ్ రావు ఇవ్వనున్నారు.
మరింత సమాచారాన్ని ...
ఇప్పటికే గత నెల 9వ తేదీన హరీశ్ రావు కమిషన్ ఎదుట హాజరై తనకు మరింత సమాచారాన్ని ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరారు. హరీశ్ రావు వినతి మేరకు కమిషన్ అంగీకరించింది. తిరిగి నేటి ఉదయం రావాలని కమిషన్ చెప్పగా ఈరోజు హరీశ్ రావు ఉదయం పదకొండు గంటలకు బీఆర్కే భవన్‌లో కమిషన్‌ను కలవనున్న హరీశ్ రావు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరికొంత సమాచారాన్నిఅందివ్వనున్నారు.