Harish Rao : నీళ్లు ఏపీకి.. నిధులు ఢిల్లీకి : హరీశ్ రావు

తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్ కి, నిధులు ఢిల్లీకి పోతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

Update: 2025-07-26 12:10 GMT

తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్ కి, నిధులు ఢిల్లీకి పోతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తెలంగాణ ప్రజల న హక్కులను కాలరాస్తున్నాయన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై హరీశ్ రావు ప్రెజెంటేషన్‌ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ హక్కులను మనం కాపాడుకోవాలన్నారు. నీటి దోపిడీపై కుట్రలను బద్దలు కొట్టాలన్న హరీశ్ రావు రేవంత్‌ ఏనాడూ జై తెలంగాణ అనలేదన్నారు. కేసీఆర్‌ను తలుచుకోకుండా రేవంత్‌ రెడ్డి ప్రసంగం ఉండదని ఎద్దేవా చేశారు.

ఉద్యమ సమయంలో...
రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయారన్న హరీశ్ రావు తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే..మొదటి పేరు చంద్రబాబు, రెండో పేరు రేవంత్‌దేనని అన్నారు. తెలంగాణ పోరాట ఆనవాళ్లను కనుమరుగుచేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తుందని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజలు అస్థిత్వాన్ని కాపాడుకునే బాధ్యత యువతదేనని అన్నారు. నీటి హక్కులు కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేస్తామన్న హరీశ్ రావు బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతామని అన్నారు.


Tags:    

Similar News