Kaleswaram Project : కాళేశ్వరం రిపోర్టు రాజకీయ బురద చల్లడం కోసమే
కాళేశ్వరం ప్రాజెక్టుపై తాను అన్ని విమర్శలకు సమాధానం చెబుతానని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తాను అన్ని విమర్శలకు సమాధానం చెబుతానని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ప్రభుత్వం ఆదరాబాదరగా కాళేశ్వరం నివేదికను సభలో పెట్టడమంటేనే బురద రాజకీయమని అర్ధమవుతుందని అన్నారు. వరదలు, యూరియా అత్యంత ముఖ్యమైన సమస్యలున్నప్పటికీ కాళేశ్వరంపై హడావిడిగా నివేదికను పెట్టారన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా అని హరీశ్ రావు మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధంగా, సహజ న్యాయంగా విచారణ జరిపిందా? అన్న దానిపై చర్చించాల్సి ఉందని, నిప్షక్షపాతంగా విచారణ కొనసాగిందా? అన్నది చర్చించాలన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే...
ఇందిరాగాంధీ షా కమిషన్ పై కోర్టుకు వెళ్లారన్నారు. ఎల్.కె. అద్వానీ కూడా తనపై కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానానికి వెళ్లారని గుర్తు చేశారు. తనకు కానీ, కేసీఆర్ కు గాని కమిషన్ నోటీసులు ఇవ్వలేదని హరీశ్ రావు అన్నారు. తుమ్మడిహట్టివద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం చెప్పిందని హరీశ్ రావు అన్నారు. ఈ కమిషన్ రిపోర్టు ఒక చెత్త అని హరీశ్ రావు కొట్టిపారేశారు. కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం , స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ కాళేశ్వరం డ్రామాను ఆడుతున్నారని మండిపడ్డారు