Harish Rao : కవితకు కౌంటర్ ఇచ్చిన హరీశ్ రావు
ఇటీవల కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు
ఇటీవల కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ తెలంగాణ పార్టీ అభిమానుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కేసీఆర్ మాత్రమేనని హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ తనకు ప్రజలు సేవ చేయడాన్ని నేర్పించారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఏ నిర్ణయమైనా...
ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారని, వాటిని నేతలు అమలు చేస్తారని హరీశ్ రావు చెప్పారు. అంటే ఇప్పటి వరకూ కవిత చేసిన ఆరోపణలపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ తమకు పార్టీ నిర్ణయాలతో సంబంధం లేదని చెప్పారు. అలాగే ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని హైడ్రాతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ను హరీష్రరావు ప్రశ్నించారు.