కాంగ్రెస్ కు కోవర్టు రోగం : దామోదర ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ కు ప్రమాదకరమైన జబ్బు వచ్చిందని మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ కు ప్రమాదకరమైన జబ్బు వచ్చిందని మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇప్పటికే చాలా తప్పిదాలు జరిగాయని, మరో తప్పు జరిగితే కాంగ్రెస్ ఉండదని ఆయన అన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. లోపం ఎక్కడ ఉందో పార్టీలో చర్చ జరగడం లేదన్నారు. కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారని దామోదర రాజనర్సింహ డిమాండ్ చేశారు. కోవర్టులకు కమిటీల్లో స్థానం కల్పించారన్నారు. కాంగ్రెస్ లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాదిగలకు సరైన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
కష్టపడిన వారికి...
పదవుల పంపకంలో మెదక్ జిల్లాలో కష్టపడిన వారికి పదవులు లభించలేదన్నారు. గుర్తింపు లేదన్నారు. కోవర్టులను గుర్తించి కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన అన్నారు. సిద్ధిపేట జిల్లాలో కోవర్టులున్నారని చెప్పినా అధినాయకత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు కోవర్టు రోగం వచ్చిందన్నారు. కొందరు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని దామోదర రాజనరసింహ అన్నారు. కోవర్టులని ఆధారాలు చూపినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. పదవుల్లో సమతుల్యత పాటించాలని ఆయన కోరారు.