Telangana : ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు
రవాణా శాఖ ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. జనవరి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకూ డెబ్భయి ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యం బస్సులు నడుపుతున్నట్లు గ్రహించారు.
నిబంధనలను అతిక్రమించి...
ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో లేకపోవడం వంటి వివిధ ఉల్లంఘనలపై ఈ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమిది ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వరస ప్రమాదాలు జరుగుతుండటం కూడా ఈ తనిఖీలకు కారణమయ్యాయి.