Revanth Reddy : తెలంగాణకు నీళ్లే కావాలి.. మాకు పంచాయతీ అవసరంలేదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జలవివాదాలను పరిష్కరించుకోవడం కోసం చర్చలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2026-01-09 12:37 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జలవివాదాలను పరిష్కరించుకోవడం కోసం చర్చలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. న్యాయస్థానాలు, ట్రైబ్యునల్ లో కాకుండా మనమే పరిష్కరించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జలవివాదాలతో రాజకీయ ప్రయోజనం తాను రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అడ్డంకులు కల్పించవద్దంటూ...
పంచాయతీ కావాలా? నీళ్లు కావాలా? అని తమను అడిగతే తాను మాత్రం తెలంగాణకు నీళ్లే కావాలని అడుగుతానని అన్నారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు దయచేసి అడ్డు పెట్టవద్దంటూ చంద్రబాబుకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అడ్డంకుల వల్లనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదని, ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని రేవంత్ రెడ్డి అన్నారు. జలవివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వస్తే, తాము పది అడగులు వేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News