Telangana : కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ పడిపోయినట్లేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్ లో పడుతున్నట్లే కనిపిస్తుంది

Update: 2026-01-09 12:43 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్ లో పడుతున్నట్లే కనిపిస్తుంది. కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత వరసగా జరిగిన పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ మరోసారి విసురుతున్న సెంటిమెంట్ వలలో రేవంత్ రెడ్డి చిక్కుకుంటున్నట్లే కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికలు మరో మూడేళ్లు ముందుగానే జలవివాదాలు ఒక రకంగా అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పాలి. కేసీఆర్ ఓటమి పాలయిన తర్వాత ప్రధానంగా నీటి విషయంలోనూ అందులోనూ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో సెంటిమెంట్ లేపి కాంగ్రెస్ ను డ్యామేజీ చేయాలని చూస్తున్నారు.

జలవివాదంలో...
అందులో భాగంగానే కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదని ప్రస్తావిస్తూనే ఇరు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా నీటి పంపకాల తేనెతుట్టెను కదిపారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వేసిన ట్రాప్ లో చిక్కుకున్నారు. కేసీఆర్ తాము పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండలలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు ముందుగానే శాసనసభ సమావేశాలను పెట్టి జలవివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇక్కడే తాను చెప్పినందునే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేశారని వ్యాఖ్యానించడంతో అటు ఏపీలోనూ నీటి యుద్ధం మొదలయింది. అయితే చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న స్నేహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా బయటపెట్టారు. ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఏంటని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబుతో సయోధ్య కారణంగా...
తాజాగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జలవివాదాలను పరిష్కరించుకోవడం కోసం చర్చలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. న్యాయస్థానాలు, ట్రైబ్యునల్ లో కాకుండా మనమే పరిష్కరించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. కేసీఆర్ అన్న ఒక్క మాటతో రేవంత్ రెడ్డి కెలుక్కుని లేని పోని వివాదాలను కొని తెచ్చుకున్నట్లయిందన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఎంత కేసీఆర్ పై నీటి విషయంలో విమర్శలు చేసినా మరోసారి సెంటిమెంట్ ను రేకిత్తించడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారు.






Tags:    

Similar News