మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులపై వస్తున్న ఆరోపణలు ఖండించారు
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. ఇటీవల కొందరు మంత్రులపైనా, మహిళ ఐఏఎస్ అధికారులపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కుటుంబాలను, మహిళలను ఇబ్బందిపెట్టే విధంగా రాతలు రాయవద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హితవు పలికారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా ఐఏఎస్ అధికారుల పట్ల అనుచితంగా ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఐఏఎస్, ఐపీఎస్ లు బదిలీలు జరిగినా అది మంత్రులకు సంబంధం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బదిలీలు జరిగేది...
ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు బదిలీలు జరుగుతాయని తెలిపారు. కేవలం రేటింగ్ లు, వ్యూస్ ల కోసం అవాస్తవాలు రాస్తూ అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రులను కూడా ఇబ్బందులు పెట్టే విధంగా రాతలు రాస్తున్న వారు ఛానళ్ల మధ్య పోటీ కోసమేనని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై తాను అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.