Telangana : నేడు మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు

Update: 2026-01-10 02:34 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు. కీలక భేటీ నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఆయన సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో నేడు జరిగే కీలక భేటీలో అదే రకమైన ఫలితాలు ఉండేలా చూడాలని నేతలను కోరనున్నారు.

ప్రతి మున్సిపాలిటీని గెలుచుకునేలా...
ప్రతి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునేలా అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా మంత్రులను ఇన్ ఛార్జులను నియమించే దానిపై కూడా చర్చించనున్నారు. ఇన్ ఛార్జి మంత్రులు ఆ యా జిల్లాల్లోని మున్సిపాలిటీలను గెలుచుకునే దిశగా ప్రయత్నం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News