రాజా సాబ్ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు షాక్

రాజా సాబ్ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది

Update: 2026-01-09 12:03 GMT

రాజా సాబ్ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రాజా సాబ్ సినిమా రేట్ల పెంపుదల మెమోను హైకోర్టు కొట్టేసింది. టిక్కెట్ల రేట్లను ఇకపై పెంచబోమని కూడా మంత్రి చెప్పారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాత ధరలకే టి్కెట్లకే విక్రయించాలని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిబంధనలు తెలియవా?
మెమోలు ఇచ్చే అధికారులకు నిబంధనలు తెలియవా? అంటూ హైకోర్టు నిలదీసింది. రాజా సాబ్ సినిమా టిక్కెట్ల ధరలను పెంపుదలకు ఎలా అనుమతించారని హైకోర్టు ప్రశ్నించింది. తెలివిగా అధికారులు మెమోలను జారీ చేస్తున్నారని అభిప్రాయపడింది. టిక్కెట్ల రేట్ల ధరలను యధాతధంగా వసూలు చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News