జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-09-17 12:56 GMT

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో పోటీ చేస్తానని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. యాదవ సామాజిక వర్గం తరపున తనకే టికెట్ ఇవ్వాలంటూ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

ఏం జరుగుతుందో తెలియదని...
కాంగ్రెస్ పార్టీలో వెనుక ఏం జరుగుతుందో తనకు తెలియదన్న అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. తన కంటే సీనియర్లు పార్టీలో ఎవరూ లేరన్న అంజన్ కుమార్ యాదవ్ హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తాను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలిపారు.


Tags:    

Similar News