ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. ఆయన ఆసుపత్రిలో చెకప్ కోసం వస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ గత కొద్ది రోజుల నుంచి జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి మరోసారి చెకప్ కోసం చేరుకున్నారు.
మరికొన్ని పరీక్షలు...
ఆస్పత్రికి కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్‌రావులు కూడా వచ్చారు. నిన్న కొన్ని టెస్ట్‌ల తర్వాత ఇవాళ మరోసారి ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్ కు మరికొన్ని పరీక్షలు నేడు చేయనున్నారు. అయితే సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని, వాతావరణ మార్పుతో వచ్చిన జలుబు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.