KCR : కాళేశ్వరం కమిషన్ నివేదికపై సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు
కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని అన్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చని, అయితే ఎవరూ భయపడవద్దంటూ కేసీఆర్ పార్టీ నేతలను కోరారు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న అన్న వారు అజ్ఞాని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొట్టిపారేశారు.
ఊహించిందే...
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఊహించిందేనని, ఎవరూ అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని, సాగు, తాగునీరు అందిందని దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కమిషన్ ను కాదని, రైతులను అడిగితే సరైన సమాధానం చెబుతారని అన్నారు.