KCR : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించండి.. కేసీఆర్ ఆదేశం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేశారు. పార్టీ నేతలను, కార్యకర్తలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు

Update: 2025-08-28 04:47 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేశారు. పార్టీ నేతలను, కార్యకర్తలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలవాలని కేసీఆర్ ఆదేశించారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా నేతలతో కేసీఆర్ స్వయంగా మాట్లాడి బాధితులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహారం, మంచినీరు వంటి వాటిని బాధితులకు అందచేయాలని సూచించారు.

భోజనాలు, పాలు, నీరు...
పార్టీ నేతలు కార్యకర్తలతో కలసి సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. నీట మునిగిన ప్రాంతాలలోని ఇళ్లకు వెళ్లి వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు. అవసరమైతే వారికి కావాల్సిన భోజన సామగ్రిని అందచేయాలని సూచించారు. ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో భోజనం ప్యాకెట్లు, నీరు, పాలు, పండ్లు వంటి వాటిని బాధితులకు అందచేయాలని ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా పార్టీ నేతలు అండగా నిలవాలని ఫోన్ లోనే కేసీఆర్ నేతలను ఆదేశించారు.


Tags:    

Similar News