నందిగం సురేష్ కు బెయిల్

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ లభించింది.

Update: 2025-06-30 12:47 GMT

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ లభించింది. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయి గత కొన్ని రోజులుగా జైలులో ఉన్నారు. ఇటీవల ఆరోగ్యం బాగాలేక పోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఛాతీలో నొప్పి రావడంతో గుంటూరు ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తీసుకెళ్లారు.

దాడి కేసులో అరెస్టయి...
దాడి కేసులో అరెస్టయిన నందిగం సురేష్ బెయిల్ కోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన తరుపున న్యాయవాదులు అనేక సార్లు ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు బెయిల్ లభించడంతో నేడో, రేపో ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. న్యాయవాదులు బెయిల్ పత్రాలను జైలు అధికారుకు సమర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News