జూరాలకు పెరుగుతున్న వరద

జూరాల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టకు వరద నీరు పోటెత్తుతుంది.

Update: 2025-06-16 01:57 GMT

జూరాల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టకు వరద నీరు పోటెత్తుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 21 వేలుగా ఉంది. ఔట్‌ఫ్లో 17,676 క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉంది.

విద్యుత్తు ఉత్పత్తి...
ప్రస్తుత నీటిమట్టం 316.500 మీటర్లుగా ఉందని తెలిపారు. జూరాల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 6.081 టీఎంసీలుగా ఉందని, విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడతాయని తెలపడంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని నీటి పారుదల శాఖ అధికారులు చెప్పారు.


Tags:    

Similar News