తెలంగాణలో జీరో కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జీరో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటించింది.

Update: 2023-01-28 03:51 GMT

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జీరో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటించింది. 3,690 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా తెలంగాణలో ఒక్కరికీ కోవిడ్ పాజిటివ్ రాలేదని పేర్కొంది. కరోనా వైరస్ ఎంటర్ అయిన తర్వాత తొలిసారి జీరో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రధమమని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

19 మంది మాత్రమే...
ప్రస్తుతం తెలంగాణలో 19 మందికి మాత్రమే కరోనా చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే కోవిడ్ ను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని పేర్కొంది. కరోనా మహ్మమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వంతో ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయడం మంచిదని సూచించింది.


Tags:    

Similar News