భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

Update: 2025-08-30 02:23 GMT

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రెండవ ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అధికారులను మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

ఎటువంటి విపత్తునైనా...
రక్షణ చర్యలకు ఫైర్ , ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర బృందాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. గోదావరి నదిపరీవాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని, నదిలోకి వరద ప్రభావం ఉన్న కాలువలు, వాగులలోకి ఈత, చేపల వేటకు వెళ్ళవద్దు ప్రజలకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ లోపు ఆయా నివసిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.


Tags:    

Similar News