Telangana: ఎట్టకేలకు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు
ఎట్టకేలకు కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించింది.
ఎట్టకేలకు కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించింది. పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గాన్ని హైకమాండ్ ప్రకటించింది. దీంతో జంబో టీం ను పీసీసీలో ఏర్పాటు చేసినట్లే కనపడుతుంది. అయితే పీసీసీ కార్యవర్గంలోనూ మంత్రివర్గ విస్తరణలో మాదిరిగా సామాజిక సమతుల్యం పాటించింది. 27 మంది ఉపాధ్యక్షులలో ఎనిమిది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ముగ్గురు మైనారిటీ సామాజికవర్గానికి చెందిన వారున్నారు.
సామాజిక సమతుల్యంతో...
69 మంది ప్రధాన కార్యదర్శి పదవుల్లోనూ వెనుకబడిన తరగతులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది. అందులో బీసీలు 26 మంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీ, ఎనిమిది మంది ముస్లింలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవుల్లో సామాజిక సమతుల్యతను పాటించింది. దాదాపు 68 శాతం మందికి పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించారు. అయితే ఈ పదవుల్లో పార్టీలో సీనియర్లు, సిన్సియార్టీ ఉన్న వారిని ఎంపిక చేశారు. యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యూ.ఐ. కి చెందిన వారిని కూడా ఎంపిక చేశారు.