నేడు ఈడీ ఎదుటకు ప్రకాశ్ రాజ్
సినీనటుడు ప్రకాష్ రాజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు.
prakash raj
సినీనటుడు ప్రకాష్ రాజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ సెలబ్రిటీలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి వారిని విచారించేందుకు సిద్ధమయింది. నలుగురు సినీ ప్రముఖలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈరో్జు విచారణకు ప్రకాశ్ రాజ్ రావాలని నోటీసులు జారీ చేశారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో...
మరికొద్ది సేపట్లో ప్రకాశ్ రాజ్ ఈడీ అధికారుల ఎదుటకు విచారణకు హాజరయ్యే అవకాశముంది. తాను రాలేనని ఎటువంటి సమాచారం ఇప్పటి వరకూ ప్రకాశ్ రాజ్ ఇవ్వకపోవడంతో ఆయన విచారణకు వస్తారని అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ పై ఇదివరకే ప్రకాశ్ రాజ్ తన వివరణ ఇచ్చిన నేపథ్యంలో నేడు విచారణలో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.