తెలంగాణ ప్రజలకు విద్యుత్తు షాక్?

తెలంగాణాలో విద్యుత్తు ఛార్జిలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు.

Update: 2021-12-27 13:05 GMT

తెలంగాణాలో విద్యుత్తు ఛార్జిలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. గృహ వినియోగదారులకు యూనిట్ కు యాభై పైసలు చొప్పున పెంచనున్నారు. అలాగే ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూపాయి చొప్పున పెంచనున్నారు. ఈ మేరకు డిస్కంల ప్రతిపాదన ప్రభుత్వానికి పంపింది.

త్వరలోనే పెంపు ఉత్తర్వులు...
విద్యుత్ ఛార్జీల పెంపుతో 2,110 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. గృహ వినియోగదారులపై పెద్దగా భారం పడకుండా ఛార్జీలను పెంపు ప్రతిపాదనను పంపామన్నారు. ఈ పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. నూతన ఏడాది ఛార్జీల బాదుడు ఉండే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News